నిధుల స్వాహాపై విచారణ జరపాలి

ABN , First Publish Date - 2023-09-21T23:27:36+05:30 IST

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో జరిగిన రూ.3.13కోట్ల నిధుల స్వాహాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావని గురువారం కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు.

నిధుల స్వాహాపై విచారణ జరపాలి
ఫిర్యాదు అందజేస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావని

ఘట్‌కేసర్‌, సెప్టెంబరు 21: ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో జరిగిన రూ.3.13కోట్ల నిధుల స్వాహాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావని గురువారం కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ ఆవిర్భావం నుంచి ప్రజల వద్ద సేకరించిన వివిధ పన్నుల డబ్బులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపాలిటీలో స్వాహా అయిన సొమ్మును సంబంధిత అధికారులు మున్సిపల్‌ బ్యాంకు ఖాతాలో జమచేసినప్పటికీ ఈభారీ అక్రమంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వివరించారు. పెద్దమొత్తంలో జరిగిన దుర్వినియోగంపై అధికారులందరిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈవ్యవహారంలో బిల్‌కలెక్టర్లపై అనేక అభియోగాలు ఉన్నాయని సీడీఎంఏకు ఇచ్చిన పిర్యాదులో వివరించారు.

Updated Date - 2023-09-21T23:27:36+05:30 IST