వైభవంగా అమ్మపల్లి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2023-01-28T00:41:49+05:30 IST

మండలంలోని నర్కూడ అమ్మపల్లి (శ్రీ సీతారాచంద్రస్వామి) ఆలయంలో శుక్రవారం బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఘనంగా జరిగాయి.

వైభవంగా అమ్మపల్లి బ్రహ్మోత్సవాలు

శంషాబాద్‌రూరల్‌, జనవరి 27: మండలంలోని నర్కూడ అమ్మపల్లి (శ్రీ సీతారాచంద్రస్వామి) ఆలయంలో శుక్రవారం బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఘనంగా జరిగాయి. జడ్పీటీసీ నీరటి తన్వీరాజు కుటుంబ సభ్యులు సుదర్శన యాగం నిర్వహించారు. నేడు పుర్ణాహుతి, స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. భక్తుల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రతలు తీసుకుంటున్నామని ఆలయ కమిటీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సిద్దులు, ఆలయ కమిటీ డైరెక్టర్లు ఆడియాల మహే్‌షకుమార్‌ దంపతులు. శివాజీ దంపతులు, మాజీ ఎంపీటీసీ స్వరూప,తదితరులు పాల్గొన్నారు. నేడు జరిగే కల్యాణోత్సవంలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ పాల్గొంటారని బీఆర్‌ఎస్‌ నేత నీరటి రాజు ఈ సందర్భంగా తెలిపారు.

Updated Date - 2023-01-28T00:41:50+05:30 IST