సంతాపూర్‌లో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2023-09-17T23:30:12+05:30 IST

మండలంలోని సంతాపూర్‌లో అంబేడ్కర్‌ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ చేశారు.

సంతాపూర్‌లో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

కేశంపేట, సెప్టెంబరు 17: మండలంలోని సంతాపూర్‌లో అంబేడ్కర్‌ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ చేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామిలు విగ్రహావిష్కరణ చేపట్టారు. సంతపూర్‌, బైర్కాన్‌పల్లి సర్పంచ్‌లు ఆంజయ్య, కృష్ణయ్య, సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ రాజు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-17T23:30:12+05:30 IST