Share News

‘అమెజాన్‌’ సేవలు అభినందనీయం

ABN , Publish Date - Dec 14 , 2023 | 11:00 PM

విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు సాధించాలంటే పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాల వసతులు ఉండాలని, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర మోడల్‌ స్కూల్స్‌ అదనపు డైరెక్టర్‌ రమణకుమార్‌ అన్నారు.

‘అమెజాన్‌’ సేవలు అభినందనీయం
డైనింగ్‌ హాల్‌ ప్రారంభిస్తున్న అందజేస్తున్న అమెజాన్‌ ప్రతినిధులు

షాబాద్‌, డిసెంబరు 14 : విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు సాధించాలంటే పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాల వసతులు ఉండాలని, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర మోడల్‌ స్కూల్స్‌ అదనపు డైరెక్టర్‌ రమణకుమార్‌ అన్నారు. మండల పరిధిలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో కన్సర్న్‌ ఇండియా ఫౌండేషన్‌ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన మౌలిక వసతులను ఏడబ్ల్యూఎస్‌ డేటా సెంటర్‌ ప్లానింగ్‌ అండ్‌ డెలివరీ వైస్‌ ప్రెసిడెంట్‌ కెర్రీ, ఎంపీడీవో అనురాధ, ఎంఈవో శంకర్‌రాథోడ్‌లతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్య, వైద్యం కోసం అమెజాన్‌ వెబ్‌సర్వీసు ఎంతో ఖర్చు చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే తెలంగాణ మాడల్‌ స్కూల్‌ కార్పోరేట్‌ విద్యాలయాలకు దీటుగా సంస్థ మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీవాచ్య, అమెజాన్‌ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 11:00 PM