ఇంజినీరింగ్ కళాశాలలో అల్యూమి మీట్
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:09 AM
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడ మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులతో శనివారం నిర్వహించిన అల్యూమి మీట్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మేడ్చల్ టౌన్, డిసెంబరు 30: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడ మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులతో శనివారం నిర్వహించిన అల్యూమి మీట్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రస్తుతం కళాశాలలో చదువుతున్న విద్యార్థులు పూర్వ విద్యార్థులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాధవీలత, డీన్, హెచ్‌వోడీలు పాల్గొన్నారు.