పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN , First Publish Date - 2023-03-19T22:58:58+05:30 IST

మండలంలోని ఏదులాబాద్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన 2016-2017 బ్యాచ్‌ విద్యార్థులు ఓకే చోట చేరారు. ఇందుకు స్థానిక భవాని ఫంక్షన్‌హాల్‌ వేదికైంది.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం
: సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు

ఘట్‌కేసర్‌ రూరల్‌ మార్చి 19: మండలంలోని ఏదులాబాద్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన 2016-2017 బ్యాచ్‌ విద్యార్థులు ఓకే చోట చేరారు. ఇందుకు స్థానిక భవాని ఫంక్షన్‌హాల్‌ వేదికైంది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వారి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, 2016-2017 బ్యాచ్‌ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T22:58:58+05:30 IST