చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

ABN , First Publish Date - 2023-03-19T00:00:12+05:30 IST

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలనిమేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దీపికా నర్సింహారెడ్డి అన్నారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
వేడుకల్లో పాల్గొన్న చైర్‌పర్సన్‌ దీపిక

మేడ్చల్‌టౌన్‌, మార్చి18: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలనిమేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దీపికా నర్సింహారెడ్డి అన్నారు. మేడ్చల్‌లోని న్యూలిటిల్‌లిల్లీ పాఠశాలలో శనివారం నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా విద్యార్థులనుద్ధేశించి మట్లాడారు. విద్యార్థులు చదువుకు పరిమితం కాకుండా క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నప్పుడే వారు శారీరకంగా, మానసికంగా బలపడుతారన్నారు. విద్యాసంస్థలు విద్యార్థులకు చదువులతో పాటు ఆటలపోటీలు నిర్వహించాలని కోరారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్‌ మంజుల ప్రకాశ్‌, డైరెక్టర్‌ సాయిదీప్‌, కౌన్సిలర్‌ జంగహరికృష్ణ, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:00:12+05:30 IST