రేషన్‌కార్డు ఉన్నవారంతా లేబర్ కార్డు పొందొచ్చు
ABN , First Publish Date - 2023-05-14T23:44:46+05:30 IST
తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతీఒక్కరు లేబర్ కార్డు పొందేందుకు అర్హులేనని ఏఐటీయూసీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు రామస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల సత్యనారాయణచారి తెలిపారు.
చేవెళ్ల, మే 14 : తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతీఒక్కరు లేబర్ కార్డు పొందేందుకు అర్హులేనని ఏఐటీయూసీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు రామస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల సత్యనారాయణచారి తెలిపారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారంతా లేబర్ కార్డుకు అర్హులు పొందొచ్చని చెప్పారు. లేబర్ కార్డు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. 18ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపు వయస్సున్న వారంతా అర్హులేనని స్పష్టం చేశారు. లేబర్ కార్డు కల్గిన కార్మికులు సహజ మరణం చెందితే రూ.1.30లక్షల ఇన్సూరెన్స్ వస్తుందన్నారు. అదేవిధంగా ప్రమాదవశాత్తు పనిచేస్తున్న క్రమంలో మరణిస్తే రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుందన్నారు. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలుంటే ఒక్కొక్కరికి వివాహం ఖర్చుల నిమిత్తం రూ.30వేలు ప్రభుత్వం వారి తరఫున బ్యాంకులో డిపాజిట్ చేస్తుందన్నారు. కార్మికులు లేబర్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, జిల్లా ఫీల్డ్ ఆఫీసర్ సందీప్‌కుమార్, సహాయ కార్యదర్శి ఎండీ మక్బూల్, ఏఐటీయుసీ మండల అధ్యక్షుడు శివ, నాయకులు శ్రీను, రాంచందర్, కార్మికులు తదితరులు ఉన్నారు.