జిల్లాలో సదరం క్యాంపులు

ABN , First Publish Date - 2023-01-31T00:18:30+05:30 IST

సదరం శిబిరాల ద్వారా దివ్యాంగులకు ధృవపత్రాల జారీకి మీసేవల్లో ఈ నెల 31న స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని డీఆర్దీఓ కృష్ణన్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో సదరం క్యాంపులు

వికారాబాద్‌, జనవరి 30: సదరం శిబిరాల ద్వారా దివ్యాంగులకు ధృవపత్రాల జారీకి మీసేవల్లో ఈ నెల 31న స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని డీఆర్దీఓ కృష్ణన్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు. వోహెచ్‌ క్యాటగిరిలో క్యాంపులు ఫిబ్రవరి 2,న సీహెచ్‌సీ వికారాబాద్‌, 9న ప్రభుత్వ ఆసుపత్రి తాండూరులో, 16న సీహెచ్‌సీ వికారాబాద్‌ వద్ద, వచ్చేనెల 23న తాండూరుప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తామన్నారు. ప్రతీ క్యాంపులో 50 మంది చొప్పున ఫిబ్రవరిలో 200మందికి అసెస్మెంట్‌ చేస్తామని తెలిపారు. ప్రజలు వినియోగించుకోవాలన్నారు.

Updated Date - 2023-01-31T00:18:32+05:30 IST