కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2023-03-07T00:02:40+05:30 IST
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.
ఇబ్రహీంపట్నం, మార్చి 6: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఎలిమినేడులో ఆయన కంటి వెలుగు కార్యక్రమాన్ని పార్రంభించారు. ఎక్కడా లేనిది తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తోందన్నారు. 18సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వడంతోపాటు శస్త్ర చికిత్సలు చేస్తారని చెప్పారు. పోషణతో కూడిన ఆహారం, ఆకుకూరలు తినాలని ఆయన సల హాఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి ధరణికుమార్, సర్పంచ్ అశోక్‌వర్ధన్‌రెడ్డి, ఉపసర్పంచ్ మార్త, ప్యాక్స్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, డాక్టర్లు భాగ్యలక్ష్మి, నాగయ్య పాల్గొన్నారు.