అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు
ABN , First Publish Date - 2023-06-13T23:03:56+05:30 IST
అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఈవో హెచ్చరించారు. పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న ఆమనగల్లు పట్టణంలోని గ్లోబల్ ప్రైడ్ పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు.
ఎంఈవో సర్దార్ నాయక్
ఆమనగల్లు, జూన్ 13 : అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఈవో హెచ్చరించారు. పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న ఆమనగల్లు పట్టణంలోని గ్లోబల్ ప్రైడ్ పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు డీఈవో ఆదేశాలతో మంగళవారం ఎంఈవో సర్ధార్ నాయక్ పాఠశాలను తనిఖీ చేశారు. పర్మిషన్లు లేవని గుర్తించి సీజ్ చేశారు.