‘పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి’
ABN , First Publish Date - 2023-02-23T00:07:27+05:30 IST
విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కొర్రెముల పంచాయతీ సభ్యులు బుధవారం జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తికి ఫిర్యాదు చేశారు.
ఘట్‌కేసర్ రూరల్, ఫిబ్రవరి 22 : విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కొర్రెముల పంచాయతీ సభ్యులు బుధవారం జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. పంచాయతీ తీర్మానాల ప్రకారం కార్యదర్శి గ్రామంలో పనులు చేపట్టడం లేదని, వార్డుసభ్యులు చెప్పిన పనులు చేయడం లేదని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ పంచాయతీ ఆదాయానికి గండికొడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వార్డుసభ్యులు జువ్వ స్వామి, దుర్గరాజుగౌడ్, బాబు, లక్ష్మి, భార్గవి, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.