ఫోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

ABN , First Publish Date - 2023-05-02T23:47:10+05:30 IST

ఫోక్సో కేసులో నిందితుడికి జీవిత కారాగార శిక్షతో పాటు రూ.వేయి జరిమానాను విధించి వికారాబాద్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తి సుదర్శన్‌ తీర్పునిచ్చినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

ఫోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

కొడంగల్‌, మే 2: ఫోక్సో కేసులో నిందితుడికి జీవిత కారాగార శిక్షతో పాటు రూ.వేయి జరిమానాను విధించి వికారాబాద్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తి సుదర్శన్‌ తీర్పునిచ్చినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా ఎస్పీ ఓ ప్రకటలో వెల్లడించారు. కొడంగల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఇంద్రానగర్‌కు చెందిన అల్లాపూరం నర్సిములుపై 2012లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో వాదోపవాదాలు విన్న తర్వాత వికారాబాద్‌ జిల్లా ఫస్ట్‌క్లాస్‌ అడిషనల్‌ సెషన్‌ కోర్టు జడ్జి సుదర్శన్‌ నిందితుడికి జీవిత ఖైదు, రూ.వేయి రూపాయలు జరిమానా విధించారు. ఈ ఘటనలో బాధితురాలికి కంపెన్‌సేషన్‌ కింద రూ.6లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. నిందితుడికి శిక్ష పడేందుకు అదనపు పీపీ యం.అశోక్‌, దర్యాప్తు అధికారి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌, రెండవ దర్యాప్తు అధికారి కె.కరుసాగర్‌రెడ్డి, కొడంగల్‌ ఎస్‌ఐ ఏ.రవిగౌడ్‌, సీడీవో బి.సురేశ్‌గౌడ్‌, పోలీసు అధికారులు వీరన్న, హాషామ్‌, ఎస్‌.నిరంజన్‌గౌడ్‌, స్నేహలత, స్రవంతిలను ఎస్పీ అభినందించారు.

Updated Date - 2023-05-02T23:47:10+05:30 IST