మెడలోంచి పుస్తెల తాడు అపహరణ
ABN , First Publish Date - 2023-04-22T00:27:26+05:30 IST
రోడ్డుపై ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి పుస్తెల తాడును దుండగులు తెంపుకొని పోయిన ఘటన పరిగిలో జరిగింది.
పరిగి, ఏప్రిల్ 21: రోడ్డుపై ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి పుస్తెల తాడును దుండగులు తెంపుకొని పోయిన ఘటన పరిగిలో జరిగింది. పరిగికి చెందిన మలిపెద్ది సంపూర్ణ గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో బస్టాండ్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా టెలిఫోన్ ఎక్ఛేంజ్ వద్ద బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు సంపూర్ణ దగ్గరకు వచ్చి ఆమె మెడలోని రెండున్నతులాలు బంగారు పుస్తెల తాడును తెంచుకుపోయారు. మహిళ అరిచినా ప్రయోజనం లేకుండాపోయింది. సం పూర్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తున్నట్లు ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపారు.