కూలీల ఆధార్ నమోదు పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2023-01-17T22:32:09+05:30 IST
జిల్లాలోని ఉపాధి హామీ కూలీల ఆధార్ నమోదును తొందరగా పూర్తి చేయాలని కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్‌నిఖిల
వికారాబాద్, జనవరి 17 : జిల్లాలోని ఉపాధి హామీ కూలీల ఆధార్ నమోదును తొందరగా పూర్తి చేయాలని కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి నుంచి అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, డీఆర్‌డీవో కృష్ణన్‌లతో కలిసి ఆధార్ నమోదు, పెండింగ్‌లో పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న ఉపాధి కూలీల ఆధార్ సేకరణ, ఆన్‌లైన్‌లో నమోదును వేగవంతం చేసి మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఎంపీడీవోల ఆధ్వర్యంలో ఆపరేటర్లు, టీఏలు, ఈసీలు, టెక్నికల్ సిబ్బందితో రాత్రి, పగలు పనులు చేయించి పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా మండలాల వారీగా సోషల్ ఆడిట్ పెండింగ్ పేరాలను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 1216సోషల్ ఆడిట్ పేరాలు పెండింగ్‌లో ఉన్నట్లు అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. వారం రోజుల్లో ఈ పేరాలను పూర్తి చేయాలని సూచించారు. .
ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్
జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ విద్యార్హత గల ఎస్సీ నిరుద్యోగ యువతీయువకులకు గ్రూప్-2, 3, 4 పరీక్షల నిర్వహణపై ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు కలెక్టర్ నిఖిల మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక డాక్టర్.బీఆర్. అంబేడ్కర్ భవన్‌లో మూడు నెలల పాటు అనుభవిజ్ఞులైన అధ్యాపకులతో ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్న భోజన సదుపాయంతో పాటు స్టడీ మెటీరియల్ అందజేయడం జరుగుతుందన్నారు. అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 17 నుంచి 31వ తేదీ వరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎ్‌సఎ్‌సటీయుడీవైసీఐఆర్‌సీఎల్‌సీ.ఇన్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వివరాలకు సెల్ : 95738 59268 నెంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.