Share News

పాల వ్యాన్‌ ఢీకొని యువతి మృతి

ABN , First Publish Date - 2023-12-10T22:52:30+05:30 IST

రోడ్డు దాటుతున్న ఓ యువతిని పాల వ్యాన్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్‌ వద్ద చోటుచేసుకుంది.

పాల వ్యాన్‌ ఢీకొని యువతి మృతి

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 10: రోడ్డు దాటుతున్న ఓ యువతిని పాల వ్యాన్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్‌ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌కు చెందిన పంది అరుణమ్మ, దానయ్యల కూతురు ప్రత్యూష(19) ఇబ్రహీంపట్నంలోని ఓ బట్టల షాపులో పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం ఇబ్రహీంపట్నం నుంచి ఇంటికి వెళ్తూ ఖానాపూర్‌ గేట్‌ వద్ద రోడ్డు దాటుతుండగా ఆగాపల్లి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న పాల వ్యాన్‌ ఢీకొట్టింది. దీంతో ప్రత్యూష తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-12-10T22:52:32+05:30 IST