గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

ABN , First Publish Date - 2023-03-19T00:07:30+05:30 IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

మరో వ్యక్తికి తీవ్ర గాయాలు

శంషాబాద్‌ రూరల్‌, మార్చి 18 : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై బాలరాంనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మదన్‌పల్లి గ్రామానికి చెందిన టి.రిషి(21), గోపి(18) కలిసి ఉదయం బైక్‌పై మదన్‌పల్లి నుంచి శంషాబాద్‌ వెళ్తున్నారు. ఈక్రమంలో అదే మార్గంలో వెళుతున్న గుర్తుతెలియని వాహనం వారి బైక్‌ను ఢీకొట్టగా.. రిషి అక్కడికక్కడే మృతిచెందగా గోపికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గోపిని శంషాబాద్‌లోని ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం రిషి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2023-03-19T00:07:30+05:30 IST