చెట్టుకు ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-06-26T23:30:12+05:30 IST

చెట్టుకు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం ధారూరులో చోటుచేసుకుంది.

చెట్టుకు ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ధారూరు, జూన్‌ 26: చెట్టుకు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం ధారూరులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సంతో్‌షకుమార్‌ తెలిపిన ప్రకారం.. ధారూరుకు చెందిన గుర్రం నవీన్‌(19) ఈనెల 16న తల్లి నర్సమ్మ మందలించిందని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో నర్సమ్మ తన కుమారుడు నవీన్‌ కనిపించడంలేదని ఈనెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ధారూరు సమీపంలోని కుమ్మరి వాగు వద్ద దుర్గంధం వస్తుందని స్థానికులు సోమవారం పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. వాగు దగ్గర కుళ్లిపోయి పడిఉన్న మృతదేహంతో పాటు సమీపంలో పుర్రె, ఎముకలు పడిఉన్నాయి. తాడు చెట్టుకు వేలాడుతూ కనిపించింది. మృతదేహం వద్ద ఉన్న చెప్పులు, దుస్తుల ఆధారంగా మృతుడు నవీన్‌గా తల్లి నర్సమ్మ గుర్తించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు.

Updated Date - 2023-06-26T23:30:12+05:30 IST