Share News

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-11-20T00:26:36+05:30 IST

మద్యం మత్తులో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టుషన్‌ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

ఘట్‌కేసర్‌ రూరల్‌, నవంబరు 19: మద్యం మత్తులో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టుషన్‌ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఘట్‌కేసర్‌ సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ మునిసిపాలిటీ, సాయినగర్‌కు చెందిన గుర్రం గాంధీ(38) తన స్నేహితులు రత్నరాజు, సురేష్‌లు ఆదివారం సాయంత్రం స్థానికంగా ఉన్న మాస్టర్‌ బేకరి వెనుకాల పార్టీ చేసుకున్నారు. తరువాత బిర్యానీ కవర్లు, చెత్తచెదారాన్ని పక్కనే ఉన్న ఖాళీస్థలంలో పారబోశారు. ఖాళీ స్థలంలో పనిచేస్తున్నవారు ఎక్కడ ఎందుకు చెత్త పారబోస్తున్నావని సురేష్‌ను నిలదీశారు. దీంతో గాంధీ రాజు, సురేష్‌లు అక్కడ పనిచేస్తున్న వారితో గొడవకు దిగారు. గొడవ పెద్దగా కావడంతో గాంఽధీ వాళ్ళ అమ్మ సరస్వతి వచ్చి గాంధీని, అతడిస్నేహితులకు నచ్చజెప్పి ఇంటికి పంపించారు. తీవ్ర మనస్తాపానికి గురైన గాంధీ ఇంటికి వెళ్లి చీరతో బాత్‌రూంలోని ఇనుపరాడ్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికి వెళ్ళి చూసిన తల్లి గాంధీ బాత్‌రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందికి దింపి పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2023-11-20T07:17:03+05:30 IST