చికిత్స పొందుతూ మహిళ మృతి
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:23 PM
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మరణించింది.
బైక్ ఢీకొనడంతో తీవ్రగాయాలు.. కుమార్తె పరిస్థితి విషమం
యాచారం, డిసెంబరు 17 : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మరణించింది. మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. గత శుక్రవారం సాయంత్రం యాచారం మండల పరిధిలోని సాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చౌదర్‌పల్లికి చెందిన తల్లీకూతుళ్లు అమీర్‌పేట ఐలమ్మ(58) ఆమె కుమార్తె అచ్చన శోభలు శుక్రవారం సాయంత్రం చౌదర్‌పల్లి గేటు సమీపంలో రోడ్డు దాటేందుకు యత్నిస్తున్నారు. ఇంతలో గున్‌గల్ గేటు నుంచి యాచారం వైపు వస్తున్న ద్విచక్రవాహనదారుడు(తేజారాం) వారిని ఢీకొట్టాడు. దాంతో తల్లీకుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు నగరంలోని కామినేని ఆసుపత్రిలో చేర్పించారు. ఐలమ్మ చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. ఆమె కుమార్తె శోభ పరిస్థితి విషమంగా ఉంది. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపాల్ తెలిపారు.