గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:01 AM
రోడ్డు దాటుతున్న ఓ మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన శనివారం శంషాబాద్ సిద్ధాంతి జాతీయ రహదారి మలుపు వద్ద జరిగింది.
శంషాబాద్, డిసెంబరు 30 : రోడ్డు దాటుతున్న ఓ మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన శనివారం శంషాబాద్ సిద్ధాంతి జాతీయ రహదారి మలుపు వద్ద జరిగింది. ఆర్జీఐఏ పోలీ్‌సస్టేషన్ ఎస్‌ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. విజయవాడ పట్టణంలో నివాసముండే కట్ట విజయలక్ష్మి(45) కుమార్తె శంషాబాద్‌లో ఉంటుంది. శనివారం కుమార్తెను చూడటానికి విజయవాడ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న బస్సులో వచ్చిన విజయలక్ష్మి సిద్ధాంతి జాతీయ రహదారి వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. కాగా, విజయలక్ష్మి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు.