Share News

బెదిరించి డబ్బులు లాక్కెళ్లిన దుండగుడు

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:59 PM

మార్కెట్‌ వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న మినీ వ్యాన్‌ డ్రైవర్‌ను ఇద్దరు దుండుగలు బెదిరించి డబ్బులు లాక్కుని పరారయ్యారు.

బెదిరించి డబ్బులు లాక్కెళ్లిన దుండగుడు

మూడుచింతల పల్లి, డిసెంబరు 26: మార్కెట్‌ వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న మినీ వ్యాన్‌ డ్రైవర్‌ను ఇద్దరు దుండుగలు బెదిరించి డబ్బులు లాక్కుని పరారయ్యారు. ఈ ఘటన శామీర్‌పేట పోలీస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సిద్దిపేట జిల్లాకు చెందిన బొక్కల దుర్గయ్య మినీవ్యాన్‌లో టమాటా లోడుతో సికింద్రాబాద్‌లోని మార్కెట్‌ వెళ్లాడు. ఆదివారం రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా శామీర్‌పేట సమీపంలోని ఫౌజీ దాబా వద్ద ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి వ్యాన్‌ను అడ్డగించి దుర్గయ్య వద్ద ఉన్న రూ.17వేల నగదును లాక్కుని పరారయ్యారు. దీంతో బాధితుడు శామీర్‌పేట పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 26 , 2023 | 11:59 PM