గిన్నీస్ వరల్డ్ రికార్డు కోసం ప్రత్యేక ప్రదర్శన
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:09 AM
నకుల్ పుషప్స్‌లో గిన్నీస్‌బుక్ రికార్డును తిరగరాసేందుకు ఘట్‌కేసర్‌కు చెందిన చింతల కృష్ణారెడ్డి ప్రదర్శన చేశాడు.
ఒక్క నిమిషంలో 133పుషప్స్
ఘట్‌కేసర్, డిసెంబరు 22: నకుల్ పుషప్స్‌లో గిన్నీస్‌బుక్ రికార్డును తిరగరాసేందుకు ఘట్‌కేసర్‌కు చెందిన చింతల కృష్ణారెడ్డి ప్రదర్శన చేశాడు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో గల తులిఫ్స్ హోటల్‌లో శుక్రవారం ఆయన శాఖల అధికారుల సమసక్షంలో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. నకుల్ పుషప్స్‌లో ఒక్క నిముషంలో ఇప్పటి వరకు 116పుషప్స్‌ను ఇటలీదేశం చెందిన వ్యక్తి సాధించగా అనంతరం భారత్‌లో పంజాబ్ రాష్ట్రంకు చెందిన హర్‌ప్రీత్‌సింగ్ 124 పుషప్స్ చేసి మొదటి స్థానంలో ఉన్నారు. ఈరికార్డును తిరగరాసి గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాందించేందుకు ఘట్‌కేసర్ మండలం అంకుషాపూర్‌కు చెందిన 48ఏళ్ల చింతల కృష్ణారెడ్డి ప్రయత్నం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలుగా కఠోర సాధన చేస్తున్న ఆయన ఎట్టకేలకు శుక్రవారం పలు శాఖల అధికారుల సమక్షంలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. ఇందులో ఒక్క నిమిషంలో 133పుషప్స్ చేశాడు. ఈ వీడియో రికార్డును గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారులకు పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణారెడ్డి తెలిపారు. గిన్నీస్ బుక్ రికార్డు అధికారులు అన్ని విధాలుగా పరిశోధించి ఆమోదిస్తే మూడు నెలల్లో కృష్ణారెడ్డికి నకుల్ పుషప్స్‌లో గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కనుంది. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కార్పోరేషన్ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.