పోలీసు శిక్షణా కేంద్రాన్ని సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2023-02-07T00:12:59+05:30 IST

జిల్లాకు పోలీస్‌ శిక్షణ కోసం వచ్చే సిబ్బందికి వసతుల్లో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అంతా సిద్ధం చేయాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

పోలీసు శిక్షణా కేంద్రాన్ని సిద్ధం చేయాలి

వికారాబాద్‌, ఫిబ్రవరి 6 : జిల్లాకు పోలీస్‌ శిక్షణ కోసం వచ్చే సిబ్బందికి వసతుల్లో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అంతా సిద్ధం చేయాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన జిల్లా పోలీసు శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమైనా ఇతర మరమ్మతులు ఉన్నట్లయితే వెంటనే పూర్తి చేయాలన్నారు. పరేడ్‌ గ్రౌండ్‌, బ్యారెక్‌లు, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, బాత్రూంలు, తరగతి గదులు, తదితర వసతుల కల్పనలో ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్‌, డీఎస్పీ విజయ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:12:59+05:30 IST