Share News

చెరువులో మునిగి వ్యక్తి మృతి

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:46 PM

ఇంటి నుంచి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని నాగారం చెరువులో సోమవారం చోటుచేసుకుంది.

చెరువులో మునిగి వ్యక్తి మృతి

ధారూరు, డిసెంబరు 18: ఇంటి నుంచి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని నాగారం చెరువులో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. మండలంలోని కుమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన గాజుల వెంకటయ్య(48) శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. ఆరోజు రాత్రి వరకు ఆయన ఇంటికి తిరిగి రాకపోవటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారికి ఫోన్‌ చేసి వాకబు చేసినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో చుట్టుపక్కల వెతకగా నాగారం చెరువు గట్టుపై వెంకటయ్య చొక్కా కనిపించటంతో అనుమానంతో కుటుంబసభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి చెరువులో వెతకగా వెంకటయ్య మృతదేహం లభ్యమైంది. కాగా మృతుడు వెంక టయ్య బార్య గాజుల ఈశ్వరమ్మ నాలుగు నెలల క్రితం రైలు ఢీకొని మృతిచెందింది. తల్లిదండ్రుల మృతితో కుమారుడు హరిప్రసాద్‌ అనాథగా మారాడు.

Updated Date - Dec 18 , 2023 | 11:46 PM