రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-08-22T23:17:13+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన జీనోమ్ వ్యాలీ పోలీ్‌సస్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
మూడుచింతలపల్లి, ఆగస్టు 22: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన జీనోమ్ వ్యాలీ పోలీ్‌సస్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సిద్ధిపేట్ జిల్లా మర్‌కూక్ మండలం వరదరాజ్‌పూర్ గ్రామానికి చెందిన సంపత్‌కుమార్(36) తుర్కపల్లిలోని యూజియ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూలాగే విధుల్లో భాగంగా బైక్‌పై తుర్కపల్లిలోని యూజియ కంపెనీకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొల్తుర్ నుంచి పోతారం వైపు వెళ్తున్న కంపెనీ బస్సును డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సంపత్ తల, ఛాతి భాగంలో బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ బస్సు ముందు భాగంలో ఇరుక్కోగా బస్సు వంద మీటర్ల వరకు దూసుకెళ్లింది. దీంతో ద్విచక్రవాహన పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగి బస్సుతో పాటు బైక్ దగ్ధమయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.