Share News

కుటుంబ పోషణ భారమై వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-10-30T23:54:18+05:30 IST

అప్పుల బాధ, కుటుంబ పోషణ భారమై వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేశంపేట మండలం వేముల్‌నర్వలో సోమవారం చోటుచేసుకుంది.

కుటుంబ పోషణ భారమై వ్యక్తి ఆత్మహత్య

కేశంపేట, అక్టోబరు 30: అప్పుల బాధ, కుటుంబ పోషణ భారమై వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేశంపేట మండలం వేముల్‌నర్వలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వరప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా జగనపల్లికి చెందిన అనగండ్ల కృష్ణ (40) తన భార్య పద్మ, ముగ్గురు సంతానంతో వేముల్‌నర్వలో పవణ్‌కుమార్‌ మామిడి తోటలో కూలి చేస్తూ అక్కడే ఉంటున్నారు. అప్పుల విషయయైు భార్యతో తరచూ గొడవ పడేవారు. దసరా సమయంలో భార్యతో గొడవ పడగా ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్థాపానికి గురైన కృష్ణ తానుం టున్న గదిలో ఉరేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2023-10-30T23:54:18+05:30 IST