నిరుపేదలకు అండగా కొత్త ప్రభుత్వం
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:14 AM
నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అన్నారు. ఆయన మేడ్చల్ ఎంపీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
మేడ్చల్ టౌన్, డిసెంబరు 16: నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అన్నారు. ఆయన మేడ్చల్ ఎంపీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడారు. పేద కుటుంబాలకు చెందిన యువతుల వివాహానికి ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం అందజేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతీ ఒక్కరు ప్రభుత్వం తరఫున సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేసిందని, మిగితా నాలుగు గ్యారంటీలు కూడా త్వరలో అమలు చేసే దిశలో చర్చలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వపాలన ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి విషయంలో ప్రజాసమస్యల పరిష్కారంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. గతంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం దరఖాస్తులు పెట్టుకున్న వారందరికీ సాధ్యమైనంత త్వరగా చెక్కులు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజయేందర్‌రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు వెంకటేష్. సర్పంచ్ గీతా భాగ్యరెడ్డి, నర్మద, శ్యామలు, సురేందర్ ముదిరాజ్, ఎంపీటీసీలు కుమార్ పాల్గొన్నారు.
మేడ్చల్ మున్సిపల్‌లో..
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు మున్సిపల్ చైర్మన్ మర్రి దీపిక నర్సింహారెడ్డి స్థానిక తహసీల్దార్ శైలజతో కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు తుడుం గణేష్, పెంజర్ల స్వామియాదవ్, కౌడె మహేష్ నాయకులు సాటె నరేందర్, మహబూబ్ అలీ, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.