బైక్‌ అదుపు తప్పి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2023-03-19T22:52:05+05:30 IST

బైక్‌ అదుపు తప్పి పడడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

బైక్‌ అదుపు తప్పి వ్యక్తి మృతి

వికారాబాద్‌, మార్చి 19: బైక్‌ అదుపు తప్పి పడడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ మహావీర్‌ ఆసుపత్రిలో కొన్ని సంవత్సరాలుగా చెఫ్‌గా పని చేస్తున్న సోమనాథ్‌(31) శనివారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో స్నేహితులు ప్రవీణ్‌, మల్లేశ్‌తో కలిసి బైక్‌పై బయటకు వెళ్లారు. మండలంలోని గొట్టిముక్ల సమీపంలో ప్రవీణ్‌ బైక్‌ను అజాగ్రత్తగా నడుపడంతో ముగ్గురూ పడిపోయారు. ఈ ప్రమాదంలో సోమనాథ్‌ మృతి చెందగా ప్రవీణ్‌, మల్లేశ్‌కు గాయాలయ్యాయి. సోమనాథ్‌ అన్న సంతోష్‌ దాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీను తెలిపారు.

Updated Date - 2023-03-19T22:52:05+05:30 IST