భార్యను కడతేర్చిన భర్త
ABN , First Publish Date - 2023-12-10T22:51:45+05:30 IST
వివాహేతర సంబంధాన్ని నెరుపుతోందనే అనుమానంతో ఓ భర్త భార్యను కత్తితో పొడిచి చంపిన ఘటన ఆదిభట్ల మన్సిపాలిటీ పరిధి తుర్కయంజాల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
వివాహేతర సంబంధం నెరుపుతోందనే అనుమానంతో హత్య!
ఆదిభట్ల, డిసెంబరు 10 : వివాహేతర సంబంధాన్ని నెరుపుతోందనే అనుమానంతో ఓ భర్త భార్యను కత్తితో పొడిచి చంపిన ఘటన ఆదిభట్ల మన్సిపాలిటీ పరిధి తుర్కయంజాల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఆదిభట్ల ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నేరెడుకొమ్ము మండలం మోసగడ్డ తండాకు చెందిన బానోతు జబ్బార్‌లాల్ భార్య జ్యోతితో కలిసి తుర్కయంజాల్‌లోని సూరజ్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. జబ్బార్‌లాల్ ఆటో నడుపుతుండగా జ్యోతి కూలి పని చేసేది. కాగా భార్య ప్రవర్తనపై కొన్ని రోజులుగా జబ్బార్‌లాల్ అనుమానంతో ఉండేవాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 12 గంటల సమయంలో అతడు జ్యోతిని కత్తితో పొడిచి చంపాడు. ఇంటి యజమాని డయల్ 100కు కాల్ చేయడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. నిందితుడు జబ్బార్‌లాల్‌ను అరెస్టు చేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.