Share News

భార్యను హత్య చేసిన భర్త

ABN , First Publish Date - 2023-12-05T23:29:19+05:30 IST

భార్యపై అనుమానంతో మద్యం మత్తులో ఉన్న భర్త రాడ్‌తో కొట్టి గొంతు నులిమి హత్య చేశాడు.

భార్యను హత్య చేసిన భర్త

తాండూరు, డిసెంబరు 5: భార్యపై అనుమానంతో మద్యం మత్తులో ఉన్న భర్త రాడ్‌తో కొట్టి గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణం సీతారాంపేట్‌కు చెందిన అనసూయ(30) భర్త శాంత్‌కుమార్‌ రోజు కూలీలు. అనసూయకు వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం పెంచుకున్న శాంత్‌కుమార్‌ సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అనంతరం భార్యతో గొడవపడ్డాడు. ఈక్రమంలో రాడ్‌తో అనసూయను కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. మృతురాలి సోదరుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేందర్‌రెడ్డి చెప్పారు.

Updated Date - 2023-12-05T23:29:20+05:30 IST