భార్యను హతమార్చిన భర్త

ABN , First Publish Date - 2023-02-21T00:29:30+05:30 IST

మద్యానికి బానిసైన ఓ వ్యక్తికి తాగడానికి డబ్బులివ్వలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు.

భార్యను హతమార్చిన భర్త

  • మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఘాతుకం

మొయినాబాద్‌, ఫిబ్రవరి 20: మద్యానికి బానిసైన ఓ వ్యక్తికి తాగడానికి డబ్బులివ్వలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం మొయినాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోస్గీకి చెందిన మహమ్మద్‌ హుస్సేన్‌ అతడి భార్య హుస్సేన్‌బీ(50)తో కలిసి బతుకు దెరువుకోసం మొయినాబాద్‌లోని విజయనగర్‌ కాలనీలో ఓ గుడిసె వేసుకొని ఉంటున్నారు. ఇక్కడ బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం సాయత్రం మహమ్మద్‌ హుస్సేన్‌ అతడి భార్య హుస్నేన్‌బీని మద్యం తాగడానికి డబ్బులు అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని భార్య చెప్పడంతో హుస్సేన్‌ ఆగ్రహంతో కర్రతో ఆమె కాళ్లపై కొట్టడంతో హుస్సేన్‌బీ కాళ్లపై కొట్టాడు. దీంతో ఆమె కిందపడి పోయింది. అంతటితో ఆగకుండా రుబ్బురోలుతో భార్య గుండెలపై బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-21T00:29:31+05:30 IST