భార్య చేసిన అప్పు తీర్చలేక కిడ్నా్‌పనకు యత్నించిన భర్త

ABN , First Publish Date - 2023-06-26T22:59:01+05:30 IST

భార్య చేసిన అప్పు తీర్చుతానని పిలిచి కిడ్నా్‌పనకు యత్నించిన భర్తతో పాటు నలుగురిని ఘట్‌కేసర్‌ పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.

భార్య చేసిన అప్పు తీర్చలేక కిడ్నా్‌పనకు యత్నించిన భర్త
అవినా్‌షరెడ్డి కిడ్నా్‌పనకు యత్నించిన నిందితులను ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌లో చూపుతున్న మల్కాజ్‌గిరి డీసీపీ జానకి, ఏసీపీ నరే్‌షరెడ్డి

నిందితులు ఉపయోగించిన కారు, బైక్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు

విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించిన మల్కాజ్‌గిరి డీసీపీ జానకి

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూన్‌ 26 : భార్య చేసిన అప్పు తీర్చుతానని పిలిచి కిడ్నా్‌పనకు యత్నించిన భర్తతో పాటు నలుగురిని ఘట్‌కేసర్‌ పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. మల్కాజ్‌గిరి డీసీపీ జానకి ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మేడ్చల్‌ జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని బుద్దానగర్‌కు చెందిన కీసర అవినా్‌షరెడ్డి (29), పొరుగున ఉండే చేరెడ్డి అరోషికరెడ్డి 2015 నుంచి స్నేహితులు. ఇరు కుటుంబాల సభ్యులంతా కలిసి మెలిసి ఉండేవారు అరోషికరెడ్డి అవినా్‌షరెడ్డి వద్ద రూ.30 లక్షలు అప్పుగా తీసుకుంది. తరువాత కొద్ది రోజుల నుంచి అరోషికరెడ్డి అవినా్‌షరెడ్డిని దూరం పెట్టి సిద్దిపేట్‌కు చెందిన గదగోని చక్రధర్‌ గౌడ్‌(35)తో పరిచయం ఏర్పడి 2018లో అతన్ని అర్యసమాజ్‌లో వివాహాం చేసుకుంది. తనను దూరంపెట్టిన విషయాన్ని గమనించిన అవినా్‌షరెడ్డి తన డబ్బులు తిగిరి ఇవ్వాలని అరోషికరెడ్డిని చేశాడు. దీంతో జనవరి 2023లో ఆమె అవినా్‌సరెడ్డికి రూ.9 లక్షల రూపాయాలను తిరిగి ఇచ్చింది. ఇరవైరోజుల తరువాత అవినా్‌షరెడ్డి మిగతా డబ్బులు కావాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో చక్రధర్‌గౌడ్‌ తన భార్య చేసిన అప్పు తీర్చుతాను మీవద్ద ఉన్న ఫొటోలు ఇవ్వమని అవినా్‌షరెడ్డిని కోరాడు. తన భార్యను ఇబ్బందులకు గురిచేస్తున్న అవినా్‌షరెడ్డి ఏలాగైన అడ్డుతొలగించుకోవాలని చక్రధర్‌గౌడ్‌ పథకం పన్నాడు. ఈ నెల 25న ఘట్‌కేసర్‌లోని వందనహోటల్‌ వద్దకు రావాలని చక్రధర్‌గౌడ్‌ అవినా్‌షరెడ్డికి ఫోన్‌లో సమాచారం అందించాడు. చక్రఽధర్‌గౌడ్‌ అతని అనుచరులు నగరంలోని అడిక్‌మెట్‌కు చెందిన మామిళ్ళ గౌతంరాజు(33), హత్యానేరంలో జైలుశిక్ష అనుభవించిన మేడ్చల్‌కు చెందిన అలగేటి నర్సింగ్‌రావు(35), చిలకలగూడకు చెందిన వినోద్‌(37), కారు నెంబర్‌(టీఎస్‌- 09-ఎఎఫ్‌ 6062)లో వచ్చారు. అవినా్‌షరెడ్డి అక్కడికి రాగానే కారులో ఎక్కించుకుని నీ ఫోన్‌లో ఉన్న నా భార్యఫొటోలు డిలీట్‌ చేయమని చక్రధర్‌గౌడ్‌ అన్నాడు. దీంతో నాకు రావాల్సిన డబ్బులిస్తేనే ఫొటోలు డిలీట్‌ చేస్తానని అవినా్‌షరెడ్డి తేల్చిచెప్పడంతో చక్రధర్‌గౌడ్‌ అనుచరులు అతనిపై దాడిచేస్తూ కారును ముందుకు తీసుకెళ్లారు. దీంతో అవినా్‌షరెడ్డి వారితో వాగ్వాదం చేసి కారులోని బయటకు దూకాడు. దీంతో చక్రధర్‌గౌడ్‌ అనుచరులు అవినా్‌షరెడ్డిని తిరిగి బలవంతంగా కారులోకి ఎక్కిడస్తుండగా స్థానికులు గమనించి కారు వద్దకు పరుగులు తీయగా, మరొకరు కిడ్నాప్‌ జరుగుతున్న విషయాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. స్థానికుల రాకను చూసిన చక్రధర్‌గౌడ్‌ అతని అనుచరులతో కలిసి కారులో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చక్రఽధర్‌గౌడ్‌ అతని అనుచరులను మేడిపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. చక్రధర్‌గౌడ్‌పై పలు పోలీసుస్టేషన్‌లో 9 కేసులు ఉన్నాయని, అతని అనుచరుడు నర్సింగ్‌రావుపై మేడ్చల్‌ పోలీసుస్టేషన్‌లో హత్యానేరం ఉందన్నారు. నిందితు లు ఉపయోగించిన ఎంజీ హెక్టార్‌ కారు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను అదుపులోకి తీసుకోని, చక్రధర్‌గౌడ్‌ అతని అనుచరులను అరెస్టు చేసి సోమవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. సంఘటన జరిగిన గంట వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్న సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు సుధాకర్‌, అశోక్‌, శ్రీకాంత్‌లతో పోలీసుసిబ్బందిని రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌, డీసీపీ జానకీ, ఏసీపీ నరే్‌షరెడ్డి అభినందించారు.

Updated Date - 2023-06-26T22:59:01+05:30 IST