అనురాగ్‌ యూనివర్సిటీలో ఘనంగా గ్రాడ్యుయేషన్‌ డే

ABN , First Publish Date - 2023-08-13T00:18:05+05:30 IST

మండలం పరిధి వెంకటాపూర్‌లో గల అనురాగ్‌ యూనివర్సిటీలో శనివారం 18వ గ్రాడ్యుయేషన్‌ డేను ఘనంగా జరుపుకున్నారు.

అనురాగ్‌ యూనివర్సిటీలో ఘనంగా గ్రాడ్యుయేషన్‌ డే
గ్రాడ్యుయేషన్‌ డేలో మాట్లాడుతున్న నవీన్‌మిట్టల్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆగస్టు 12: మండలం పరిధి వెంకటాపూర్‌లో గల అనురాగ్‌ యూనివర్సిటీలో శనివారం 18వ గ్రాడ్యుయేషన్‌ డేను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ల్యాండ్‌ రెవెన్యూ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నవీన్‌ మిట్టల్‌ ముఖ్య అథితిగా హాజరై మాట్లాడుతూ.. పట్టభద్రులు ఆసక్తిగల రంగాలను ఎంచుకొని రాణించాలన్నారు. సమాజానికి అవసరమయ్యే పరిశోధనలు చేయాలని సూచించారు. పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఇతరులకు ఉద్యోగాలు కల్పించాలని సూచించారు. యూనివర్సిటీ చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రులు అంకితభావంతో పనిచేసి ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నారు. సమాజాభివృద్ధికి సమయాన్ని కేటాయించాలని కోరారు. ఇంజినీరింగ్‌ టాపర్లకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో చాన్స్‌లర్‌ యూబీ దేశాయ్‌, వీసీ రామచంద్రం, సీఈవో నీలిమ, రిజిష్ట్రార్‌ బాలాజీ, గ్లోబల్‌ హెడ్‌ డేటా అనలిటిక్స్‌ జితేంద్ర చక్రవర్తి, డీన్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-13T00:18:05+05:30 IST