రోడ్డు ప్రమాదంలో జింక మృతి

ABN , First Publish Date - 2023-06-26T00:13:44+05:30 IST

యాచారం మండలంలోని గున్‌గల్‌ రిజర్వ్‌ ఫారెస్టులో హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతిచెందింది.

రోడ్డు ప్రమాదంలో జింక మృతి

యాచారం, జూన్‌ 25 : యాచారం మండలంలోని గున్‌గల్‌ రిజర్వ్‌ ఫారెస్టులో హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతిచెందింది. విషయం తెలుసకున్న ఫారెస్ట్‌ రేంజర్‌ విష్ణువర్దన్‌రావు జింకకు పంచనామా నిర్వహించి దహనం చేయించారు. కాగా, తరచూ వాహనాదారులు ఆ దారివెంట వేగంగా వెళుతుండటంతో జింకలు రోడ్డుపైకి వచ్చిన వెంటనే ఢీకొడుతున్నారని రేంజర్‌ తెలిపారు. కాగా, రోడ్డు వెంట వెళ్లేవారు మరణించిన జింకను చూసి తల్లడిల్లారు.

Updated Date - 2023-06-26T00:13:44+05:30 IST