ప్రగతి భవన్ నుంచి డాక్టర్ తుప్ప ఆనంద్‌కు పిలుపు
ABN , First Publish Date - 2023-10-30T23:54:17+05:30 IST
ప్రముఖ వైద్యుడు డాక్టర్ తుప్ప ఆనంద్‌కు ప్రగతిభవన్ నుంచి పిలుపువచ్చింది. తనను కలవాలంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి పిలుపు రావడంతో ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్‌కు వెళ్లి కలిశారు.
కలిసి పని చేద్దాం.. త్వరలో మళ్లీ కలుద్దామన్న కేటీఆర్
వికారాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రముఖ వైద్యుడు డాక్టర్ తుప్ప ఆనంద్‌కు ప్రగతిభవన్ నుంచి పిలుపువచ్చింది. తనను కలవాలంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి పిలుపు రావడంతో ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్‌కు వెళ్లి కలిశారు. మొదట ఆనంద్ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకున్న కేటీఆర్.. ఆ తర్వాత వృత్తి, సేవా కార్యక్రమాల గురించి ఆరాతీశారు. ‘కలిసి పనిచేద్దాం.. సిద్ధంగా ఉండు.. త్వరలో మళ్లీ కలుద్దాం..’ అంటూ కేటీఆర్ డాక్టర్ ఆనంద్‌కు సూచించారు. ఇదిలా ఉంటే, మోమిన్‌పేట మండల కేంద్రానికి చెందిన డాక్టర్ తుప్ప ఆనంద్ ఈ ఎన్నికల్లో వికారాబాద్ నుంచి బీఆర్‌ఎస్ టికెట్ ఆశించారు. అధికారపార్టీ చాలా వరకు సిట్టింగులకే టిక్కెట్ ఖరారు చేయడంతో ఆయన తన అభ్యర్థనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం లభించలేదు. ఇదిలా ఉంటే, ఎన్నికల ప్రచారం జోరందుకున్న ఈ సమయంలో ప్రగతి భవన్ నుంచి డాక్టర్ తుప్ప ఆనంద్‌కు పిలుపురావడం వెనుక ఆంతర్యమేమిటనేది అధికార పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.