ఫార్మసీ రంగానికి ఉజ్వల భవిష్యత్తు

ABN , First Publish Date - 2023-10-11T00:03:41+05:30 IST

రానున్న రోజుల్లో ఫార్మసీ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని అనురాగ్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ బాలాజీ ఉట్ల తెలిపారు.

ఫార్మసీ రంగానికి ఉజ్వల భవిష్యత్తు
కార్యక్రమంలో పాల్గొన్న అనురాగ్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ బాలాజీ

ఘట్‌కేసర్‌ రూరల్‌, అక్టోబరు 10: రానున్న రోజుల్లో ఫార్మసీ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని అనురాగ్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ బాలాజీ ఉట్ల తెలిపారు. మండలంలోని వెంకటాపూర్‌ అనురాగ్‌ యూనివర్సిటీలో మంగళవారం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఆయన ముఖ్యఅఽథితిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేశారు. వైద్యరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలు జరగాలని తెలిపారు. డ్రగ్స్‌ రెసిస్టెన్స్‌ వంటి సవాళ్లను కృత్రిమ మేదస్సు సహకారంతోనే ఎదుర్కోవాలన్నారు. ఆర్ట్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ సాయంతో తక్కువ ధరకు మందులను తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసీ డీన్‌ వసుధభక్ష్మి, కన్వీనర్‌ సునంద్‌, సయ్యద్‌, నవీన్‌, ఫరానా, మౌనిక, రాముడు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-11T00:04:00+05:30 IST