ఉద్యానానికి ఊతం...!

ABN , First Publish Date - 2023-03-30T00:45:17+05:30 IST

కూరగాయ రైతులు నకిలీ బారినపడకుండా... నాణ్యమైన మొక్కలను పంపిణీ చేసేందుకు ఉద్యానశాఖ చర్యలు తీసుకుంటోంది. జీడిమెట్ల ప్రాంతంలో హైటెక్‌ నర్సరీని ఏర్పాటు చేశారు.

ఉద్యానానికి ఊతం...!

కూరగాయల సాగుకు ప్రోత్సాహం

సబ్సిడీపై టమాట, వంగ, ఎండు మిర్చి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌ తీగజాతి కూరగాయల నారు పంపిణీ

హైదరాబాద్‌లోని జీడిమెట్ల సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ నుంచి సరఫరా

ఆసక్తిగల రైతులు సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు

కూరగాయ రైతులు నకిలీ బారినపడకుండా... నాణ్యమైన మొక్కలను పంపిణీ చేసేందుకు ఉద్యానశాఖ చర్యలు తీసుకుంటోంది. జీడిమెట్ల ప్రాంతంలో హైటెక్‌ నర్సరీని ఏర్పాటు చేశారు. అత్యాధునికంగా, సాంకేతికతను ఉపయోగిస్తూ కూరగాయ నారు మొక్కలు పెంచుతున్నారు. పూర్తిగా ఆటోమేషన్‌ సీడింగ్‌ మెషిన్‌ ద్వారా నారును ఉత్పత్తి చేస్తున్నారు. షీడ్‌ నెట్లలో పెంచే నారు మొక్కలతో పోలిస్తే ఇవి ఆరోగ్యకరంగా, దృఢంగా ఉండి చీడపీడలను తట్టుకునే శక్తి, ముఖ్యంగా వైరస్‌ అన్నది నారుకు రాకుండా ఉంటుంది. ఇందులో టమాట, వంగ, పచ్చిమిర్చి తదితర నారుని పెంచి రైతులకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు.

(రంగారెడ్డి అర్బన్‌, మార్చి 29): వ్యవసాయం నిత్య నూతనం. ఎప్పటికప్పుడు అందిస్తున్న నూతన విధానాలు, సాంకేతిక పద్ధతులు సాగు రూపు రేఖలను మార్చి వేస్తున్నాయి. ముఖ్యంగా కూరగాయల నారు ఎంత ఆరోగ్యంగా ఉంటే దిగుబడులు అంత నాణ్యంగా ఉంటాయి. గతంలో మడుల్లో నారు పెంచి అంది వచ్చిన నారుని ప్రధాన పొలంలో నాటుకునే వారు. ఈ విధానంలో ఉన్న ఇబ్బందులను అధిగమిస్తూ.. ఆరోగ్యవంతమైన నారు మొక్కలను ఉత్పత్తి చేయడానికి షెడ్‌నెట్లు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. ప్రస్తుతం రైతులందరినీ దృష్టిలో ఉంచుకుని పంటల సాగును ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లోని జీడిమెట్ల సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ, ములుగు, సిద్దిపేట జిల్లాలో సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ హైటెక్‌ నర్సరీలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆచరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం రైతుకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇప్పుడు అత్యాధునికంగా, సాంకేతికంగా ఉపయోగిస్తూ కూరగాయల నారు మొక్కలను పెంచుతున్నారు. పూర్తిగా ఆటోమెటేషన్‌ సీడింగ్‌ మెషిన్‌ ద్వారా నారును ఉత్పత్తి చేస్తున్నారు. షెడ్‌ నెట్లలో పెంచే నారు మొక్కలతో పోలిస్తే ఇవి ఆరోగ్యకరంగా, దృఢంగా ఉండి, చీడ పురుగుల నుంచి తట్టుకునే శక్తి, ముఖ్యంగా వైరస్‌ అన్నది నారుకు రాకుండా ఉంటుంది. ఇందులో టమాట, వంగ, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, క్యాప్సికమ్‌, తీగ జాతి కూరగాయలు తదితర నారు పెంచి వేసవిలో కూరగాయల నారు రైతులు ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు రైతు ముందుగా నాన్‌-సబ్సిడీ పోర్షన్‌(డీడీ) ఏడీహెచ్‌, సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ, జీడిమెట్ల/ఏడీహెచ్‌, సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ ములుగు పేరిట డీడీ చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫాంకి డీడీని జత చేసి ఇవ్వాలి. అప్లికేషన్‌ ఇచ్చిన నెల రోజుల తర్వాత మొక్కలు సరఫరా చేయడం జరుగుతుంది. ఒక్కో రైతుకు గరిష్ఠంగా రెండున్నర ఎకరాల వరకు కూరగాయల నారు ఇస్తారు.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ఎంతో పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ఆటో మెషిన్‌ హైటెక్‌ నర్సరీతో నారు పెంపకం చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే నారు మొక్కలు అవసరమైన రైతులకు ఇక్కడ నుంచి సబ్సిడీ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ మొక్కలు అవసరం ఉన్న రైతులు తమకు దగ్గరలో ఉన్న హర్టికల్చర్‌ అధికారి (హెచ్‌వో), హర్టికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ అధికారి (హెచ్‌ఈవో)ని సంప్రదించాలి. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

సునందరాణి, జిల్లా ఉద్యానశాఖ అధికారి

నారు వివరాలు

పంట నారు ఒక ఎకరానికి ఎకరానికి సబ్సిడీ రైతు

మొక్కకు(రూ) నారు సంఖ్య అయ్యేఖర్చు(రూ) (రూ.) వాటా(రూ)

టమాట, వంగ 1.00 8,000 8,000 6,500 1,500

పచ్చిమిర్చి 1.25 6,400 8,000 6,720 1,280

ఎండు మిర్చి, కాప్సికమ్‌ 3.55 2,500 8,875 7,500 1,375

తీగజాతి కూరగాయలు

---------------------------------------------------------------------------------------

రైతులు సంప్రదించాల్సిన అధికారులు, వారి ఫోన్‌ నంబర్లు

ఉద్యాన అధికారి మండలాలు ఫోన్‌నెంబర్‌

బి. కనక లక్ష్మీ బాలాపూర్‌, సరూర్‌నగర్‌, అబ్ధుల్లాపూర్‌మెట్‌, హయత్‌గనర్‌ 7997725239

మంచాల, ఇబ్రహీంపట్నం, యాచారం, మాడ్గుల

వి. అశోక్‌ చేవెళ్ల, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, షాబాద్‌, శేరిలింగంపల్లి, 9704118520

రాజేంద్రగనర్‌, గండిపేట, ఆమనగల్లు, కడ్గాల్‌.

టి. ఉషారాణి షాద్‌నగర్‌, కేశంపేట, కొత్తూరు, నందిగామ, చౌదరిగూడెం, 7997725243

కొందుర్గు, తలకొండపల్లి

వై. సౌమ్య శంషాబాద్‌, మహేశ్వరం, కందుకూరు 9347399624

Updated Date - 2023-03-30T00:45:17+05:30 IST