Share News

‘చెత్త’ గొడవ.. దంపతులపై దాడి

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:18 AM

తమ ఇంటి వైపు చెత్త ఊడ్చకూడదని చెప్పినందుకు దంపతులపై దాడి చేసిన ఘటన బుధవారం శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

‘చెత్త’ గొడవ.. దంపతులపై దాడి

శంషాబాద్‌ రూరల్‌, డిసెంబరు 27 : తమ ఇంటి వైపు చెత్త ఊడ్చకూడదని చెప్పినందుకు దంపతులపై దాడి చేసిన ఘటన బుధవారం శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని పెద్దతూప్ర గ్రామానికి చెందిన యాదయ్య, జ్యోతి భార్యాభర్తలు. ఈ నెల 24న అదే గ్రామానికి చెందిన ఇంద్రమ్మ వారి ఇంటి ముందు ఉన్న చెత్తను యాదయ్య ఇంటివైపు ఊడుస్తుండగా.. తమ ఇంటి ముందుకు చెత్తను ఎందుకు వేస్తున్నావని ప్రశ్నించారు. దాంతో ఇంద్రమ్మ కుమారుడు సాయికిరణ్‌ యాదయ్య, జ్యోతితో గొడపడ్డాడు. వారిని వారించేందుకు యత్నించిన యాదయ్య అన్న కుమారుడు మైల కార్తీక్‌ను సాయికిరణ్‌ రాళ్లతో దాడి చేయడంతో కార్తీక్‌ తలకు బలమైన గాయమైంది. దీంతో కార్తీక్‌ను ఆస్పత్రికి తరలించారు. సాయికిరణతో పాటు సందీప్‌, శ్రీధర్‌ కలిసి యాదయ్య, జ్యోతి, కార్తిక్‌ తల్లి పద్మమ్మను కొట్టారు. బుధవారం వారు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Dec 28 , 2023 | 12:18 AM