జిల్లాలో 521 సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-09-17T23:51:19+05:30 IST

జిల్లాలో 3,369 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా.. అందులో 521 సమస్యాత్మక స్టేషన్లను గుర్తించినట్లు కలెక్టర్‌ హరీష్‌ తెలిపారు. ఆదివారం ఆయన కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు.

జిల్లాలో 521 సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు : కలెక్టర్‌

రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 17 : జిల్లాలో 3,369 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా.. అందులో 521 సమస్యాత్మక స్టేషన్లను గుర్తించినట్లు కలెక్టర్‌ హరీష్‌ తెలిపారు. ఆదివారం ఆయన కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో గొడవలు, అభ్యర్థికి 90 శాతం ఓట్లు పడిన స్టేషన్లు, మిస్సింగ్‌ ఓట్లు అధికంగా ఉన్న విషయాలను పరిగణలోకి తీసుకుని సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లను గుర్తించామని తెలిపారు. అత్యధికంగా రాజేంద్రనగర్‌లో 119 ఉన్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నంలో 75, ఎల్బీనగర్‌లో 35, మహేశ్వరంలో 83, శేరిలింగంపల్లిలో 37, చేవెళ్లలో 58, కల్వకుర్తిలో 66, షాద్‌నగర్‌ నియోజకవర్గంలో 48 పోలింగ్‌ స్టేషన్లను గుర్తించినట్లు చెప్పారు. కాగా, జిల్లాలో 6,800 చనిపోయిన ఓట్లను గుర్తించినట్లు చెప్పారు. డబుల్‌ ఓట్లు 3,33,991 ఉండగా.. 1,73,454 ఓట్లను రిటర్న్‌ చేశామని, 1,57,000 ఓట్లు తొలగించామన్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు ఓటు నమోదుకు 2.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని, కొత్తవారు 47వేలు పెరిగినట్లు చెప్పారు. ఈనెల 19వరకు ఓటు నమోదుకు అవకాశం కల్పించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2023-09-17T23:51:19+05:30 IST