ఓటు హక్కు కోసం 47,963 దరఖాస్తులు

ABN , First Publish Date - 2023-09-21T23:25:25+05:30 IST

జిల్లాలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి వయోజనులు, ఓటర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఓటు హక్కు కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు.

ఓటు హక్కు కోసం 47,963 దరఖాస్తులు

అభ్యంతరాలకు 19,795,మార్పులు, చేర్పులకు 14,918 అప్లికేషన్లు

ముగిసిన జాబితా సవరణ గడువు

వికారాబాద్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి వయోజనులు, ఓటర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఓటు హక్కు కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఓటు హక్కుకు, ఇతర సవరణలకు 82,676 దరఖాస్తులొచ్చాయి. ఓటు హక్కు కోసం 47,963, అభ్యంతరాలకు 19,795, మార్పులు, చేర్పుల కోసం 14,918 చొప్పున దరఖాస్తులు వచ్చాయి సెప్టెంబరు 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. రెండు నెలల పాటు కొనసాగిన ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో వచ్చిన 82,676 దరఖాస్తుల్లో 40,863 దరఖాస్తులను ఆమోదించగా, 898 తిరస్కరించారు. మరో 40,915 దరఖాస్తులు విచారణ దశలో ఉన్నాయి. కొత్త ఓటరు దరఖాస్తుల్లో 31,625 ఆమోదం పొందగా, 340 తిరస్కరించారు. 15,998 దరఖాస్తులు విచారణలో ఉన్నాయి. జాబితాలపై వచ్చిన విజ్ఞప్తుల్లో 1,808 పరిష్కరించారు. మార్పులు, చేర్పులకొచ్చిన వాటిలో 7,430 ఆమోదించి, 461 దరఖాస్తులను తిరస్కరించారు. కాగా వికారాబాద్‌ నియోజకవర్గంలో 23,422 దరఖాస్తులొచ్చాయి. ఓటరు నమోదుకు 12,553, అభ్యంతరాలపై 7,679, మార్పులు, చేర్పులకు 3,190 దరఖాస్తులు వచ్చాయి. పరిగిలో వచ్చిన 22,715, తాండూరులో 15,202 కొడంగల్‌లో 21,061 చొప్పున దరఖాస్తులు వచ్చాయి.

వయోజనుల నుంచి అనూహ్య స్పందన

ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై కలెక్టర్‌ నారాయణరెడ్డి చొరవ చూపడంతో వయోజనుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఓటర్ల నమోదుపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాలనూ చేపట్టారు. కళాశాలల్లోనూ ఓటరు నమోదు కార్యక్రమాలు చేపట్టారు. నమోదు సమయాల్లో పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, అధికారులు సందర్శించారు.

Updated Date - 2023-09-21T23:25:25+05:30 IST