317 జీవోను రద్దు చేయాలి
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:25 PM
గత ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని, ఆ జీవోతో స్థానికత లేకుండా చేయడంతో కుటుంబాలకు దూరంగా ఉంటూ నరకం అనుభవిస్తున్నామని సోమవారం 317 జీవో బాధిత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివా్‌సరావు, ప్రధాన కార్యదర్శి కాలె శ్రీశైలం, కోశాధికారి చక్రపాణి, రామానందం, మల్లికార్జున్ తదితరులు ప్రొ.కోదండరామ్‌కు విన్నవించారు.
ప్రొ.కోదండరాంను ఆశ్రయించిన ఉపాధ్యాయులు
యాచారం, డిసెంబరు 18 : గత ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని, ఆ జీవోతో స్థానికత లేకుండా చేయడంతో కుటుంబాలకు దూరంగా ఉంటూ నరకం అనుభవిస్తున్నామని సోమవారం 317 జీవో బాధిత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివా్‌సరావు, ప్రధాన కార్యదర్శి కాలె శ్రీశైలం, కోశాధికారి చక్రపాణి, రామానందం, మల్లికార్జున్ తదితరులు ప్రొ.కోదండరామ్‌కు విన్నవించారు. ఈమేరకు నగరంలోని ఆయన నివాసంలో కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 317 జీవో కారణంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు వికారాబాద్‌కు బదిలీ చేయడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా వాసులను ఇతర జిల్లాలకు పంపి.. ఇతర జిల్లాల వాసులకు రంగారెడ్డిలో పోస్టింగ్‌లు ఇచ్చారని వాపోయారు. దాంతో జిల్లాలోని స్థానిక ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. 317 జీవో కారణంగా వందలాది మంది ఉపాధ్యాయులు నెలల తరబడి భార్యాపిల్లలను చూడలేని దుస్థితి ఏర్పడిందని కోదండరామ్‌కు విన్నవించారు. యాదాద్రి, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం తదితర జిల్లాలకు చెందిన వారిని రంగారెడ్డిలో నియమించారని, వారిని తక్షణమే స్వస్థలాలకు పంపాలని కోరారు. వికారాబాద్ జిల్లాలో పనిచేస్తున్న స్థానికత కోల్పోయిన రంగారెడ్డి జిల్లావాసులను రంగారెడ్డి జిల్లాకు పంపించేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌తో చర్చించి ఆదుకోవాలని వారు విన్నవించారు.