కల్వకుర్తి నియోజకవర్గంలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు
ABN , First Publish Date - 2023-09-17T23:48:07+05:30 IST
పాలమూరు-రంగారెడ్డి, కేఎల్‌ఐ డీ-82 ఎత్తిపోతల పథకాల ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరందించి రైతుల కలలను సాకారం చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు.

ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
ఆమనగల్లు, సెప్టెంబరు 17 : పాలమూరు-రంగారెడ్డి, కేఎల్‌ఐ డీ-82 ఎత్తిపోతల పథకాల ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరందించి రైతుల కలలను సాకారం చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైపాల్ మాట్లాడుతూ రైతుల సాగునీటి కలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించకపోగా ఆ పార్టీ నాయకులు పనులకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను తేల్చాలని డిమాండ్ చేశారు. జడ్పీటీసీ అనురాధపత్యనాయక్, మార్కెట్ చైర్మన్ శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు తదితరులున్నారు.