Share News

25వేల కేసులు పరిష్కారం

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:12 AM

జాతీయ లోక్‌ అదాలత్‌లో వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి, తాండూర్‌ కోర్టుల్లో మొత్తం 25వేల కేసులు రాజీపడినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి కె.సుదర్శన్‌ అన్నారు.

25వేల కేసులు పరిష్కారం
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్‌

వికారాబాద్‌, డిసెంబరు 30: జాతీయ లోక్‌ అదాలత్‌లో వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి, తాండూర్‌ కోర్టుల్లో మొత్తం 25వేల కేసులు రాజీపడినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి కె.సుదర్శన్‌ అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ మెగాలోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, సీనియర్‌ సివిల్‌ జడ్జి డీబీ శీతల్‌, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ జడ్జి కె.శ్రీకాంత్‌, అదనపు న్యాయాధికారి శ్రుతి దూత, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజేశ్వర్‌ , అన్వే్‌షసింగ్‌, సమీన బేగం, వికారాబాద్‌ బార్‌వైస్‌ ప్రెసిడెంట్‌ శంకరయ్య, గోవర్దన్‌రెడ్డి, సంపూర్ణఆనంద్‌, యాదవ్‌రెడ్డి, కమల్‌రెడి,్డ బస్వరాజ్‌పటేల్‌, మాధవ్‌రెడ్డి, నాగరాజు, శ్రీనివాసరావు, న్యాయవాదులు వికారాబాద్‌ జిల్లా పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

పరిగి: కేసుల్లోని ఇరు పక్షాలు రాజీపడితే లోక్‌అదాలత్‌లో కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని పరిగి మున్సిఫ్‌ కోర్టు న్యాయాధికారి కె.జనార్ధన్‌ అన్నారు. పరిగి కోర్టులో శనివారం లోక్‌ అదాలత్‌ నిర్వహించి కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయాధికారి మాట్లాడుతూ.. కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృథా చేసుకోరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీపీవో దీపారాణి, ఏజీపీ బి.వెంకట్‌రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రాంచందర్‌, కె.శ్రీశైలం, న్యాయవాదులు నర్సింహారావు పాల్గొన్నారు.

లోక్‌ అదాలత్‌లో 4215 కేసుల పరిష్కారం

తాండూరు: తాండూరు కోర్టులో శనివారం మెజిస్ర్టేట్‌లు శివలీల, నామాల అశోక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో మొత్తం 4215 కేసులు పరిష్కరించారు. కొన్ని కేసులకు సంబంధించి రూ.3లక్షల 53వేల 190 జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు శ్రీనివా్‌సరెడ్డి, పాశం రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:12 AM