ప్రజావాణికి 231 దరఖాస్తులు
ABN , First Publish Date - 2023-06-26T22:49:26+05:30 IST
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డిఅన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్, జూన్ 26: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డిఅన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 231 ఫిర్యాదులను అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్‌లతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసి సమస్యల సత్వరమే పరిష్కరించాలని పెండింగ్‌లో ఉంచరాదన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.