Share News

ప్రజావాణికి 138 దరఖాస్తులు

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:16 PM

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు.

ప్రజావాణికి 138 దరఖాస్తులు
మేడ్చల్‌ : దరఖాస్తులను స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి

స్వీకరించిన అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ

వికారాబాద్‌, డిసెంబరు 18 : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వారి సమస్యలపై 138 ఫిర్యాదులను మరో అదనపు కలెక్టర్‌ లింగ్యా నాయక్‌తో కలసి స్వీకరించారు. ఈ సందర్భంగా రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అర్హతల మేరకు వెంటనే పరిష్కరించాలని ఆయా అధికారులకు ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

మేడ్చల్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెం టనే పరిష్కరించాలని మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి 180 దరఖాస్తులను డీఆర్వో హరిప్రియ, లా ఆఫీసర్‌ చంద్రావతితో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజావాణిలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. తమ పరిధిలో లేని సమస్యలేమైనా వస్తే అర్జీదారులకు తగిన సూచనలిచ్చి సమస్య పరిష్కార మార్గాలను చూపాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:16 PM