రంజాన్ ఉపవాస దీక్షల క్యాలెండర్ ఆవిష్కరణ
ABN , First Publish Date - 2023-03-19T22:50:16+05:30 IST
రంజాన్ ఉపవాస దీక్షల క్యాలెండర్‌ను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ ఆదివారం మంబాపూర్‌లో ఆవిష్కరించారు.

పెద్దేముల్/తాండూరు, మార్చి 19: రంజాన్ ఉపవాస దీక్షల క్యాలెండర్‌ను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ ఆదివారం మంబాపూర్‌లో ఆవిష్కరించారు. పెద్దేముల్ మండలం మంబాపూర్‌లో ఆయన ముస్లింలు, గ్రామస్థులతో కలిసి ఉపవాస దీక్షల క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని చెప్పారు. పండగను భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహలతో నిర్వహించుకోవాలని సూచించారు. ఏప్రిల్ 2వ తేదీన తాండూరులో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రవణ్‌కుమార్, మాజీ సర్పంచ్ ప్రకాశం, ముజీబ్, కుర్వరాజు, దుగ్గాపూర్ శ్రీనివాస్, డీలర్‌లాలు, మాజీ ఉపసర్పంచ్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. తాండూరులో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ ముస్లిం పెద్దలతో కలిసి రంజాన్ ఉపవాస దీక్షల క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అబిద్, షేక్ ఫరీద్, మహ్మద్ యూసుఫ్, హనీఫ్, వహీద్, మస్తాన్, శుభప్రద్ యువసేనా సభ్యులు భాను ప్రసాద్, శ్రీశైలం, విజయ్, హరీష్, మురళీగౌడ్ తదితరులున్నారు.