Medico Preethi: డాక్టర్ ప్రీతిది హత్యే: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2023-03-05T19:33:18+05:30 IST

మెడికో ప్రీతి (Medico Preethi)ది హత్యేనని బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) స్పష్టం చేశారు. శవానికి ట్రీట్‌మెంట్ చేస్తూ సినిమా చూపించారని దుయ్యబట్టారు.

Medico Preethi: డాక్టర్ ప్రీతిది హత్యే: బండి సంజయ్‌

వరంగల్: మెడికో ప్రీతి (Medico Preethi)ది హత్యేనని బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) స్పష్టం చేశారు. శవానికి ట్రీట్‌మెంట్ చేస్తూ సినిమా చూపించారని దుయ్యబట్టారు. ప్రభుత్వం నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రీతి కేసులో ఆధారాలను తారుమారు చేశారని విమర్శించారు. డెడ్‌బాడీలు మాయం చేసే చిల్లర సంస్కృతి ఈ ప్రభుత్వానిదేనన్నారు. ప్రీతి మృతి కేసుపై సీఎం కేసీఆర్ (KCR), మంత్రి కేటీఆర్ (KTR) ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సంజయ్‌ డిమాండ్ చేశారు.

కేంద్రం ఇచ్చిన నిధులను ఏం చేశారో చెప్పాలి

కేంద్రం ఇచ్చిన నిధులను ఏం చేశారో చెప్పాలి?.. రాష్ట్రంలో ఎంతమంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు (Double bedroom houses) కట్టించారు? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లపై సీఎం కేసీఆర్‌ శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధరణితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ బ్యాచ్ రాత్రికి రాత్రే పేదల భూములను మార్చుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఒక్క లిక్కర్ ద్వారానే రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. విద్యుత్‌, బస్‌ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని తప్పుబట్టారు. తండ్రి వారసత్వంతో లిక్కర్ దందాలోకి వెళ్లి ఇరుక్కుపోయారని, లిక్కర్‌ స్కామ్‌తో నిజంగా ఏ సంబంధం లేకపోతే.. కుమార్తె కవిత నిర్దోషని బహిరంగంగా కేసీఆర్‌ ఎందుకు చెప్పట్లేదు? అని సంజయ్‌ ప్రశ్నించారు.

Updated Date - 2023-03-05T19:33:18+05:30 IST