మార్కెట్‌కు కొత్త పసుపు

ABN , First Publish Date - 2023-01-24T00:40:36+05:30 IST

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు కొత్త పసుపు రాక మొదలైంది. జిల్లా నుంచేకాక పక్క జిల్లాల నుంచి పసుపును రైతులు మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. మార్కెట్‌ కు కొత్త పసుపు వస్తున్నా ఇప్ప టికీ ధర పెరగలేదు. వ్యాపారులు పాత ధరకే కొనుగోలు చేస్తున్నారు.

మార్కెట్‌కు కొత్త పసుపు

నాణ్యమైన పసుపు వస్తున్నా పెరగని ధర

వర్షాల వల్ల తగ్గిన దిగుబడి

ఎండిన పసుపునే తీసుకురావాలంటున్న అధికారులు

నిజామాబాద్‌, జనవరి 23(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు కొత్త పసుపు రాక మొదలైంది. జిల్లా నుంచేకాక పక్క జిల్లాల నుంచి పసుపును రైతులు మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. మార్కెట్‌ కు కొత్త పసుపు వస్తున్నా ఇప్ప టికీ ధర పెరగలేదు. వ్యాపారులు పాత ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఎన్నో ఆశలతో మార్కెట్‌కు కొత్త పసుపును తీసుకవస్తున్న రైతులకు నిరాశే ఎదు రవుతోంది. గత సం వత్సరం చివరగా వచ్చిన ధరలే వస్తుండడంతో కొత్త పసుపుతో పాటు పాత పసుపును కూడా అదే రేటుకు అమ్మకాలను చేస్తున్నా రు. మార్కెట్‌కు కొత్త పసుపు రాక మొదలుకావడంతో ఆ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పూర్తిగా ఎండిన పసుపునే మార్కెట్‌కు తీసుకురావాలని కోరుతున్నారు. ఈ వారం కొద్ది మొత్తంలో వచ్చినా సోమవారం నుంచి కొంత పెరిగింది. పాత పసుపుతో పాటు టీఎంసీ అనే రకానికి చెందిన పసుపు ముందే రావడం వల్ల రైతులు తవ్వకాలు చేపట్టి పసుపును మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం పాత పసుపు 2355 బ్యాగులు రాగా కొత్త పసుపు 1580 బ్యాగులు వచ్చింది. ఈ వారం ముగిసేలోపు కొత్త పసుపు ఎక్కువ మొత్తంలో వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టు మార్కెట్‌లో కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు కొన్ని రకాల పసుపును సాగుచేయడం వల్ల అవి ముందే రావడంతో తవ్వకాలు చేస్తున్నారు.

సంక్రాంతి నుంచే కొత్త పసుపు

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు ప్రతి సంవత్సరం సంక్రాంతి నుంచే కొత్త పసుపు వస్తుంది. జనవరి నుంచి జూన్‌ వరకు రైతులు ఈ పసుపును తీసుకు వస్తారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలలో అత్యధికంగా మార్కెట్‌లో పసుపు అమ్మకాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఈ మూడు నెలల్లోనే రైతులు పండించిన 70శాతం వరకు పసుపు మార్కెట్‌కు వస్తుంది. జిల్లా రైతులతో పాటు పక్కనే ఉన్న జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల నుంచి రైతులు ఈ పసుపును మార్కెట్‌కు తీసుకువస్తారు. జిల్లాలో ఈ సంవత్సరం 40వేల ఎకరాల్లో పసుపు సాగుచేశారు. పక్కనే ఉన్న ఆ రెండు జిల్లాల్లో సుమారు 30వేల ఎకరాల వరకు పసుపు సాగైంది. ఈ మూడు జిల్లాతో పాటు కరీంనగర్‌, వరంగల్‌ నుంచి కూడా రైతులు కొద్ది మొత్తంలో పసుపును ఈ మార్కెట్‌కే తీసుకువచ్చి అమ్మ కాలు చేస్తారు. జిల్లాకు చెందిన కొంతమంది రైతులు పసుపును మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మకాలు చేస్తున్నారు. జిల్లాలో పసుపు సాగు ప్రతి సంవత్సరం పెరుగుతున్నా ధర మాత్రం పెరగడంలేదు. పసుపుకు యేడాదికేడాది పెట్టుబడి మాత్రం పెరుగుతోంది. పసుపులో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రకాలు వచ్చిన పెట్టుబడి తగ్గడంలేదు. అధిక వర్షాలు, తెగుళ్ల వల్ల దిగుబడి కొంతమేర తగ్గుతుంది. ఎకరాకు 20 నుంచి 30 క్వింటాళ్ల మధ్య దిగుబడి వస్తున్నా కొంతమందికి మాత్రం తగ్గుతుంది. మార్కెట్‌లో తీసుకువచ్చిన తర్వాత పెట్టుబడికి మించి రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

కొన్నేళ్లుగా పెరగని ధర

జిల్లాలోని రైతులు ప్రతి సంవత్సరం పసు పు సాగుచేస్తున్నా గడిచిన కొన్నేళ్లుగా ధర మాత్రం పెరగడంలేదు. పసుపుకు 13ఏళ్ల క్రితం క్వింటాకు రూ.15వేలకు పైగా ధర పలకగా ప్రస్తుతం మార్కెట్‌కు క్వింటా రూ.4100 నుంచి 7వేల 500 మధ్యనే ధర వస్తుంది. గత సంవత్సరం సీజన్‌లో కూడా ధర పెరగలేదు. పసుపు బాగా వచ్చినపుడు క్వింటా రూ.4500 నుంచి రూ.9వేల మధ్య ధర పలికింది. కొమ్ము రకానికి ఈ ధర వచ్చి న మండ రకానికి మాత్రం కొంతమేర తగ్గిం ది. మార్కెట్‌కు గత వారం రోజులుగా కొత్త పసుపు వస్తున్నా ధర మాత్రం పెరగలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో పసుపు క్వింటా 4వేల నుంచి 7వేల 400 మధ్య ధర పలుకుతుంది. మార్కెట్‌కు సోమవారం రైతులు తీసుకువచ్చిన కొత్త పసుపు ఎక్కువ మొత్తంలో క్వింటా 5వేల నుంచి 6500 మధ్యనే అమ్మకాలు జరిగాయి. రై తులు పెద్దమొత్తంలో పసుపు తవ్వకాలు చే పట్టినా ధర ఎక్కువగా లేకపోవడంతో రైతు ల ఆచితూచి పసుపు మార్కెట్‌కు తీసుకవస్తున్నారు. ధర రూ.7వేల నుంచి 9వేల మ ధ్య అమ్మకాలు జరిగితే ఎక్కువ మొత్తంలో తెచ్చేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వ్యా పారులు కూడా మార్కెట్‌కు వస్తున్న పసుపును బట్టి కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో కొత్త పసుపు వస్తే నాణ్యత కూడా ఎక్కువగా ఉండ నుండడంతో ఆ సమయంలో ఎక్కువ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి నెల నుంచి మార్కెట్‌కు జోరుగా పసుపు రానుండడంతో ఆ శాఖ అధికారులు కూడా జిల్లాలోని పసుపు పండించే గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. రైతులు ఎండిన పసుపునే తీసుకురావాలని గ్రామాల్లో రైతులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉడకబెట్టి 12 రోజులు ఆరబెట్టిన పసుపును తీసుకువస్తే ధర వస్తుందని వారికి వివరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో వస్తున్న ధర వల్ల తమకు పెద్దగా ఉపయోగమేమిలేదని రైతులు వాపోతున్నారు. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడడం వల్ల పెట్టుబడి పెరిగిందన్నారు. ప్రస్తుతం వస్తున్న ధర వల్ల లాభమేమోకాని పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వారంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు ధరను పెరిగేవిధంగా చూడాలని కోరుతున్నారు.

ఈ యేడాది దిగుబడి రాలేదు..

: ఆకుల నర్సయ్య, ముప్కాల్‌

ఈ యేడాది నాలుగు ఎకరాలు వేసాను. దిగబడి మాత్రం రావడంలేదు. గత సంవత్సరం 45బస్తాల వరకు దిగుబడి వస్తే ప్రస్తుతం 28 బస్తాలే వచ్చింది. పెట్టుబడి మాత్రం భారీగా పెరిగింది. మార్కెట్‌లో పసుపు ధర పెరగడంలేదు. పెట్టుబడికి తగిన ధర లేకపోవడం వల్ల నష్టమేతప్ప లాభం లేదు.

ధర వచ్చేవిధంగా చూస్తున్నాం..

: వెంకటేశం, కార్యదర్శి

పసుపుకు మార్కెట్‌లో ధరవచ్చేవిధంగా చూస్తున్నాం. రైతులకు ముందుగానే గ్రామాల వారీగా అవగాహన కల్పిస్తున్నాం. ఎండిన పసుపునకు ఎక్కువగా ధర వస్తుంది. రైతులందరు పూర్తిగా ఆరబోసిన తర్వాతనే పసుపు తీసుకురావాలని కోరుతున్నాం. ఈ-నామ్‌ ద్వారానే పసుపు కొనుగోలు చేస్తున్నాం.

Updated Date - 2023-01-24T00:40:36+05:30 IST