విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం

ABN , First Publish Date - 2023-03-31T02:00:57+05:30 IST

మండలంలోని అంకాపూర్‌ గ్రామంలో గుర్తుతెలియని దొంగలు రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లను ధ్వంసం చేశారు.

 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం

ఆర్మూర్‌టౌన్‌, మార్చి 30: మండలంలోని అంకాపూర్‌ గ్రామంలో గుర్తుతెలియని దొంగలు రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లను ధ్వంసం చేశారు. పంట పొలాల్లో ఏర్పాటు చేసిన రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌లను బుధవారం అర్ధరాత్రి గ్రామ శివారులోని ధ్వంసం చేసి అందులోని కపర్‌వైర్‌ను చోరీ చేశారు. సమీపంలోని పంట పొదల్లో ట్రాన్స్‌ఫార్మర్‌ పరికరాలను పడేసి వెళ్లారు. సంఘటన స్థలాన్ని విద్యుత్‌ ఏడీఈ శ్రీధర్‌, ఏఈ మనీష, లైన్‌ ఇన్స్‌పెక్టర్‌ నరేందర్‌ నాయక్‌లు పరిశీలించి స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-03-31T02:00:57+05:30 IST